బంగారు బతుకమ్మ ఉయ్యాలో..


Thu,October 3, 2019 12:09 AM

-పల్లె కార్యాచరణ ప్రణాళిక నిరంతర ప్రక్రియ..
-గ్రామాలన్నింటికీ మౌలిక వసతులు కల్పించడమే ప్రణాళిక లక్ష్యం
-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తా..మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
-జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ,సత్యవతి, ఎంపీ నామా పర్యటన
-గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి గ్రామంలో మొక్కలు నాటిన మంత్రులు
-చుంచుపల్లి తండా అభివృద్ధికి రూ.5 లక్షలు విరాళం ఇచ్చిన సర్పంచ్ ధనలక్ష్మి


కొత్తగూడెం అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని పరిశీలించేందుకు బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావులు డీఆర్‌డీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో పాల్గొని మహిళా ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. పంచాయతీరాజ్‌శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బతుకమ్మ పాటకు మహిళలతోకలిసి లయబద్దంగా చప్పట్లతో స్టెప్పులేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ హరిప్రియ పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles