108 ప్రసాదాలతో నైవేథ్యం


Thu,October 3, 2019 12:04 AM

శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి బుధవారం 108 ప్రసాదాలతో నైవేథ్యం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు.
పాల్వంచ రూరల్ : మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో దసరా సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కుమారి పూజలు (నవదుర్గ పూజలు) జరిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నవదుర్గల రూపంలో తొమ్మిది మంది చిన్న పిల్లలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి వారికి అమ్మవారి గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలను ఈవో శ్రీనివాస్ దంపతులు అందించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను బ్రహ్మశ్రీ అవధానుల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారు భక్తులకు అన్నపూర్ణదేవి రూపంలో దర్శనమిచ్చారు.


జూలూరుపాడు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని వెంగన్నపాలెం, మాచినేనిపేటతండా, కాకర్ల, గుండెపుడి, సూరారం, పాపకొల్లు గ్రామాల్లోని మండపాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల్లో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
లక్ష్మీదేవిపల్లి : మండలంలోని శ్రీనగర్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు అమ్మవారు భద్రకాళిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles