ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం..


Thu,October 3, 2019 12:04 AM

పాల్వంచ : ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దామని కోరుతూ పాల్వంచ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించాలని, ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి సహకరించాలని అన్నారు. అనంతరం ర్యాలీ పట్టణంలోని అన్ని వీధుల్లో కొనసాగింది. కార్యక్రమంలో కమిషనర్ శ్రీకాంత్, సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపాలిటీ డీఈ మురళి, ఏఈ రాజేష్, టీపీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ]\


జూలూరుపాడు : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించి గుడ్డ సంచులు, పేపర్ కవర్లనే వాడాలని మండల స్పెషలాఫీసర్ సుధాకర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామంలో బుధవారం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్లాస్టిక్ కవర్ల నిర్మూలనపై భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులను విక్రయించిన వ్యాపారులకు రూ.1500, కొనుగోలుచేసిన వినియోగదారుడికి రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ జగదీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి బండి అనంత్‌కుమార్ గ్రామసర్పంచ్ సావిత్రి, ఉపసర్పంచ్ కిరణ్, ఎంపీటీసీ మధుసూదన్‌రావు గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని త్రీటౌన్ సెంటర్‌లో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. త్రీ టౌన్ సెంటర్ నుంచి మెప్మా సిబ్బంది రైతుబజార్ వరకు స్వచ్ఛభారత్ ర్యాలీ నిర్వహించారు. రోడ్ల వెంట పడవేసిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని రైతుబజార్ వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ నాగయ్య, రీసోర్స్ పర్సన్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రామవరం : ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ పరమాత్ముడు ఉంటాడని కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతంపూర్ ఎండీ కాలనీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. దేశవ్యాప్తంగా సింగరేణి సంస్థలో సింగరేణి కార్మిక వీధుల్లో ప్లాస్టిక్‌లేకుండా చేసి ఆదర్శంగా నిలుద్దామని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్విరాన్‌మెంట్ మేనేజర్ సత్యనారాయణ, అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞచేయించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం నారాయణరావు, డీజీఎం సామ్యుల్ సుధాకర్, డీవైపీఎం కిరణ్‌బాబు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, సెక్యూరిటీ ఆఫీసర్ రమణారెడ్డి, ఎంపీటీసీ రుక్మిణి, రుద్రంపూర్ మాజీ సర్పంచ్ గొగ్గెల లక్ష్మీ, టీబీజీకేఎస్ నాయకులు లిక్కిచంద్రశేఖర్, మోహన్‌రెడ్డి, చిరంజీవి ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles