మంత్రుల పర్యటన సక్సెస్


Thu,October 3, 2019 12:03 AM

కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 2 :పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీ నామా నాగేశ్వరరావులకు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్‌రావులు ఘనస్వాగతం పలికారు. ఐదు కిలోమీటర్లు సుజాతనగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, విద్యానగర్ కాలనీ, పోస్టాఫీస్ సెంటర్, బస్టాండ్ సెంటర్, సూపర్‌బజార్, పాత బస్‌డిపో నుంచి ఇల్లెందు గెస్ట్‌హౌస్ వరకు స్వాగత కటౌట్లు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగూడెం నగరం అంతా గులాబీమయం అయింది.మండలం చుంచుపల్లి తండా పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామసభలో భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యే విధంగా చేయడంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయవంతం అయ్యారు. వచ్చిన మంత్రులకు బతుకమ్మ ఆటపాటలతో, లంబాడీ సంప్రదాయ నృత్యాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు.వనమా వెంకటేశ్వరరావు తనను తాను మేరా నామ్ వనమా నాయక్ అని సంబోధించుకోవడంతో సభలో నవ్వులు విరిశాయి. సభాప్రాంగణం అంతా చప్పట్లతో మార్మోగింది.


తండా సర్పంచ్ గ్రామాభివృద్ధి కోసం తన అత్త మాజీ వైస్ ఎంపీపీ మాలోత్ ఈరి జ్ఞాపకార్ధం రూ.5లక్షలు ట్రీగార్డుల కోసం ప్రకటించడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభినందించారు.విద్యావంతురాలైన సర్పంచ్ ధనలక్ష్మీ చుంచుపల్లి తండాను అభివృద్ధి చేశారని, ఈ గ్రామానికి ప్రజాప్రతినిధులందరూ అధిక నిధులు కేటాయించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చొరవచూపాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.రజత్‌కుమార్ శైనీ డైనమిక్ కలెక్టర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పలుమార్లు సంబోధించారు. ఆయన నేతృత్వంలో జిల్లా పల్లె ప్రణాళికలో శరవేగంగా దూసుకుపోతోందని, ఇలాంటి కలెక్టర్ ప్రతీ జిల్లాకు అవసరమన్నారు.ముగిసిన అనంతరం భోజనానికి సుమారు 60 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఇల్లెందు అతిథిగృహానికి మంత్రులు చేరుకున్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles