మహాత్మాగాంధీకి ఘన నివాళి


Thu,October 3, 2019 12:02 AM

కొత్తగూడెం అర్బన్: అహింసను ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనందరం పయనిద్దామని కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవంలో భాగంగా కొత్తగూడెం త్రీ టౌన్ సెంటర్‌లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ... బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్న ప్రభుత్వ పిలుపు విజయవంతమైందని అన్నారు. ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులన్నింటి వాడకాన్ని నిషేధించినట్టు ప్రకటించారు. వీటి విక్రయాలను వ్యాపారులు బాధ్యతగా నిలిపివేయాలన్నారు. ఒక్కసారి వినియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని ప్రజలను కోరారు. జిల్లాలో ఇప్పటివరకూ 2577 బస్తాల ప్లాస్టిక్ వ్యర్ధాలను హైదరాబాద్ ఐటీసీకి తరలించినట్లు చెప్పారు. నిషేధిత ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో నార, పేపర్, వస్త్రంతో చేసిన బ్యాగులను తయారు చేసే బాధ్యతను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించినట్టు చెప్పారు. ప్లాస్టిక్ విక్రేతలకు, వినియోగదారులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మెప్మా ఆధ్వర్యంలో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, జిల్లా ఆడిట్ అధికారి కృపాకర్‌రావు, మెప్మా డీఎంసీ సుజాత తదితరులు పాల్గొన్నారు.


సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో...
కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ప్రధాన ఆస్పత్రిలో బుధవారం జాతిపిత మహాత్మాగాంధీ 150 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) ఎస్.శంకర్ పాల్గొన్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎంవో మంతా శ్రీనివాస్, జీఎం పర్సనల్ (వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్) కె.బసవయ్య, జీఎం (హెచ్‌ఆర్‌డీ) ఎస్‌వీఎస్‌ఎస్ రామలింగేశ్వరుడు, సీఎంవోఏఐ ప్రతినిధి రాజీవ్‌కుమార్, కంపెనీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు సోమిరెడ్డి, బీవీ రావు, సీనియర్ పీవోలు బేతిరాజు, శ్రీనివాస్, మెయిన్ ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆస్పత్రి ఆవరణలో చెత్తాచెదారాన్ని డైరెక్టర్, జీఎంలు, అధికారులు, వైద్యులు తొలగించారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles