మణుగూరు-పర్ణశాల బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేయాలి


Thu,September 19, 2019 11:52 PM

-అసెంబ్లీలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మణుగూరురూరల్: పినపాక నియోజకవర్గంలోని హెడ్‌క్వార్టర్ మణుగూరు-పర్ణశాల మధ్య బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయాలని అసెంబ్లీలో పినపాక ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆయన గు రువారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. గతంలో బ్రిడ్జి నిర్మాణానికి వందకోట్లు మంజూరు చేశారని, ఆ జీవో రద్దు చేశారని గుర్తు చేశారు. బ్రిడ్జి ఎంతో ముఖ్యమైనదని, భద్రాచలంలో శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు మణుగూరు-పర్ణశాల బ్రిడ్జిని అనుసంధానం చేస్తే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. అదేవిధంగా ఈబ్రిడ్జిని 163హైవేకు అనుసంధానం చేసిన బ్రిడ్జి అని, బ్రిడ్జి నిర్మాణానికి మళ్లీ మంజూరు చేసేందుకు ఏమైనా ప్రతిపాదనలు ఉంటే చెప్పాలని మంత్రిని కోరారు. మంత్రి అవకాశాలను పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిపారు.


54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles