హరితహారానికి జాతీయ రహదారి రెడీ..


Thu,September 19, 2019 11:51 PM

సుజాతనగర్, సెప్టెంబర్ 19: జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు సిద్ధమైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా సుజాతనగర్ పంచాయతీకి విచ్చేసిన కలెక్టర్ రజత్ కుమార్‌శైనీ సుజాతనగర్ మండలంలోని డేగలమడగు గ్రామం నుంచి చుంచుపల్లి మండలం సరిహద్దు వరకు మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం మండల స్పెషల్ ఆఫీసర్ పొనుగోటి కృపాకర్‌రావు నిత్యం మండలంలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, మూడు పంచాయతీల అధికారులను సమన్వయ పరుస్తూ, అధికారులకు సూచనలు చేస్తూ పంచాయతీలను ఆభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. దీనిలో భాగంగానే జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తను తొలగిస్తూ హరితహారం మొక్కలను నాటించాలని జాతీయ రహదారికి ఇరువైపులా డోజర్ల సహాయంతో చెత్తను తొలగించే పనులు చేయిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ముందుగా ప్రారంభమయ్యే డేగలమడుగు నుంచి జిల్లా కేంద్రం వరకు హరితహారం మొక్కలతో సుందరీకరణ చేయాలన్న తలంపుతో యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించామని, ఈ కార్యక్రమానికి కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ రానున్నారని ఆయన తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles