రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం


Thu,September 19, 2019 11:51 PM

ఖమ్మం వ్యవసాయం: రైతులకు మద్దతు ధర కల్పించడమే తెలంగాణ ప్రభు త్వం లక్ష్యమని జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వ రరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటర మణలు అన్నారు. గురువారం నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమా వేశంలో వారు అధికారులతో కలిసి మాట్లాడారు. రైతును రాజును చేయాలనే కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంటల కొనుగోళ్ల కోసం ప్రభు త్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందించడం జరుగుతుం దన్నారు. అందులో భాగంగానే గత మూడు రోజుల క్రితం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో వైరా మార్కెట్ కమిటీలో పెసర కొనుగోలు కేంద్రం ప్రారంభించమన్నారు. నేడు ఖమ్మం నేలకొండపల్లి మార్కెట్లలో సైతం మరో రెండు సెంటర్లను ఏర్పా టు చేయడం జరిగిందన్నారు. ఈ కొనుగోలు కేంద్రాలలో పెసరకు క్వింటా ఒక్కంటికి రూ 7,050 చెల్లించడం జరుగతుందన్నారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ఆర్ సంతోష్‌కుమార్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ బీ వాణీ, ఆత్మ ఖమ్మం డివిజన్ చైర్మన్ బోయినపల్లి లక్ష్మన్, ఖమ్మం ఏఎంసీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి సభ్యుడు మందడపు సుధాకర్, నున్నా మాధవరావు, పాల్గొన్నారు.


మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం ప్రారంభం
నగర వ్యవసాయ మార్కెట్ కమిటీలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెసల కొనుగోలు కేంద్రం ప్రారంభం అయ్యింది. నగర కార్పొరేషన్ మేయర్ డాక్టర్ జీ పాపాలాల్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణలు లాంఛనంగా కేంద్రాన్ని ప్రారంభంచారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాస్, అర్బన్ మండల వ్యవసాయశాఖ అధికారి బీ కిషోర్,డీఎంఓ ఆర్ సంతోష్‌కుమార్, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ బీ వాణీ, కార్మిక సంఘం నాయకుడు నున్నా మాధవరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరావు, గ్రేడ్-టూ అధికారి బజార్‌తో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది, ఎదులాపురం సొసైటీ సీఈఓ, మార్క్‌ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles