తాలిపేరు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత


Thu,September 19, 2019 11:51 PM

-9,285 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల
చర్ల రూరల్ : తాలిపేరు ప్రాజెక్టు 3 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి గురువారం 9,285 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్‌లోకి 9,500 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో 74 మీటర్ల నీటి సామర్థ్యం కలిగిన తాలిపేరు డ్యామ్‌లో 73.130 మీటర్ల నీటిని నిల్వచేసి అదనపు నీటిని అవసరమైన మేరకు గేట్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి వదిలేస్తున్నట్లు తాలిపేరు ప్రాజెక్టు డీఈఈ తిరుపతి తెలిపారు. ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువలకు కలిపి 160 క్యూసెక్కుల నీరు పంట పొలాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద 90శాతం పంటలు సాగుచేయడంతో రైతులు ఆనందిస్తున్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles