ఘనంగా రాములోరి నిత్యకల్యాణం


Thu,September 19, 2019 11:49 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు రామునికి అభిషేకం, ఆరాధన, పుణ్యఃవచనం, నివేదన, సేవాకాలం తదితర పూజలు గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు రామాలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


రామున్ని దర్శించుకున్న జాతీయ బీసీకమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు సాంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles