ఘనంగా స్వామివారి నిత్యకల్యాణం


Thu,September 19, 2019 01:08 AM

భద్రాచలం, నమస్తేతెలంగాణ: భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు రామయ్యకు అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామునికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


రామాలయం హుండీ ఆదాయం రూ.1,29,05,412 ...
భద్రాచలం, నమస్తేతెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నందు బుధవారం రామయ్య హుండీ ఆదాయం లెక్కించారు. రూ.1,29,05,412లు (కోటి, ఇరవై తొమ్మిది లక్షల, అయిదు వేల, నాలుగు వందల పన్నెండు)ల నగదు వచ్చినట్లు దేవస్థానం ఈవో రమేష్‌బాబు తెలిపారు. అదేవిధంగా బంగారం 225 గ్రాములు, వెండి 2కేజీలు రాగా, యూఎస్ డాలర్లు 1673, ఇంగ్లాండ్ పౌండ్స్ 1510 యూవన్, సౌది రియాల్స్ 1, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ 1/2 రియల్, మలేషియన్ రింగిట్స్ 92 వచ్చినట్లు ఈవో తెలిపారు. 79రోజులకు గాను ఈఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles