పల్లె ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి


Thu,September 19, 2019 01:07 AM

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ
దుమ్ముగూడెం: ప్రగతి ప్రణాళిక పనులను పగడ్బంధీగా అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దుమ్ముగూడెం, తూరుబాక గ్రామాలలో పర్యటించారు. ముందుగా దుమ్ముగూడెం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఖాళీ ఇండ్లను అధికారులు తొలగిస్తుండగా వాటిని పరిశీలించారు. అదేవిధంగా దుమ్ముగూడెం పంచాయతీలో ఎంత జనాభా ఉందని సర్పంచ్ రాజేష్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...పంచాయతీల్లో ఖాళీగా ఉన్న ఇండ్లు ఎన్ని ఉన్నాయని ఎంపీడీవో బైరవ మల్లీశ్వరిని అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీనగరం, ముల్కపాడు, దుమ్ముగూడెం గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఖాళీగా ఉన్న ఇండ్లు ఎక్కువగా ఉన్నాయని ఎంపీడీవో తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు దుమ్ముగూడెం గ్రామంలో ఉంటున్నారా అని అడిగారు.


గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన కలెక్టర్ ఎంపీడీవో, డీఎఫ్‌వోకు తమ సమస్యను తెలియపర్చాలని సూచించారు. అనంతరం తూరుబాక గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేయాలని, కమ్యూనిటీ ఇంకుడు గుంటలు, ఇంకుడుగుంటలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పనులు చేపట్టాలని తెలిపారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్, ఎంపీడీవో బైరవ మల్లీశ్వరి, తహసీల్దార్ ఎన్‌టీ ప్రకాష్‌రావు, సర్పంచ్‌లు చందు, మడివి రాజేష్, ప్రత్యేక అధికారులు హరి, ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శులు ఉపేందర్, వాగిణి, పీహెచ్‌సీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles