ప్లాస్టిక్ రహిత ఖమ్మం లక్ష్యం..


Wed,September 18, 2019 12:40 AM

-ప్లాస్టిక్ వినియోగంతో మానవాళికి ముప్పు
-బరువు తక్కువ ఉన్న చిన్నారులను గుర్తించి ఆరోగ్య సేవలందించండి
- 2 కే వాక్ ఫర్ ప్లాస్టిక్ ఫ్రీ లో కలెక్టర్ కర్ణన్
మయూరిసెంటర్: ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యవరణానికి, మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. మంగళవారం 2 కే వాక్ ఫర్ ప్లాస్టిక్ ఫ్రీ ఖమ్మం, పోషణ మాసం ర్యాలీని కలెక్టర్ నగర మేయర్ డాక్టర్ జీ పాపాలాల్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 26, 2020 సంవత్సరం నాటికి ఖమ్మం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని ప్రతి పౌరుడు తాను కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలనే ఆలోచనతో రోజువారి జీవన విధానంలో ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా జనపనార, క్లాత్, పేపర్ సం చులు, స్టీలు ప్లేట్లు, గ్లాసులు వినియోగించాలన్నారు. రోజువారి కార్యక్రమంలో భాగంగా పచారి సామానులు ఖరీదుకు వెళ్లే సందర్భాల్లో స్వయంగా ఇంటి నుంచి జనపనార సంచులను తీసుకువెళ్లడం ద్వారా షాపుల యజమానులు ప్లాస్టిక్ కవర్లు, సంచులు వినియోగాన్ని రూపుమాప వచ్చాన్నారు. వాణిజ్య, వ్యాపార వేత్తలు, చిరువ్యాపారం చేసే వారు పండ్ల వ్యాపారస్తులు పూర్తిగా ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిలిపివేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుందన్నారు. మురుగు కాలువలలో ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల మురికి నీళ్లు రోడ్ల మీ దకు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని వీటన్నింటిని ప్రజలు గమనించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానివేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పోషకా హారం లోపంవల్ల చిన్నారులు బరువు తక్కువగా ఉండి అనారోగ్యానికి గురవు తున్నారని, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చిన్నారులకు పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న బాలలకు ఐరన్ మాత్రలు, పోషకాహారం అందించాలన్నారు. పోషణ్ అభియాన్ మాసంలో చేపడ్తున్న కార్యక్రమాలపై రూపొందించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోషణ అభియాన్ కార్యక్రమం, మిషన్ ప్లాస్టిక్ ఫ్రీ ఖమ్మం పై ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం మేయర్ పాపాలాల్ మాట్లాడుతూ పర్యావరణ పరీరక్షణ కోసం ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిలిపివేసి గుడ్డ సంచుల వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు అని ఆయన తెలిపారు. ర్యాలీలో ఇన్‌చార్జ్ డీపీవో హన్మంత్ కొడింబా, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్‌డీవో ఇందుమతి, జిల్లా సంక్షేమ అధికారి ఆర్ వరలక్ష్మీ, డీఈవో మదన్‌మోహన్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు బుజ్జిబాబు,మైన్స్ అండ్ జియాలజీ ఏడీ సంతోష్‌కుమార్, కలెక్టరేట్ ఏవో మదన్‌గోపాల్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరంధామరెడ్డి, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్ నీరజ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles