పోలీసు ఉద్యోగాల కోసం విద్యార్థులకు ఉచిత శిక్షణ


Wed,September 18, 2019 12:32 AM

బంజారాహిల్స్,నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధం చేసేందుకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు రైట్ చాయిస్ అకాడమీ ముందుకు వచ్చింది. శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని రైట్ చాయిస్ అకాడమీలో ఉచితంగా శిక్షణను ఇవ్వనున్నామని నిర్వాహకులు మెండెం కిరణ్‌కుమార్ తెలిపారు. ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి అభినందించారు.సెప్టెంబర్ 29నుంచి రెండు తెలుగు రాష్ర్టాల్లోని 10 నగరాల్లో రాత పరీక్షను నిర్వహించి 500 మంది అభ్యర్థులను ఎంపిక చేసి అక్టోబర్ 9నుంచి శిక్షణ ఇవ్వనున్నారని కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8985093399, 89850 944 99 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles