24గంటలు అందుబాటులో ఉండాలి


Tue,September 17, 2019 02:43 AM

-అదనపు పడకలు వెంటనే ఏర్పాటు చేయండి..
-ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
-శానిటేషన్ విభాగ సూపర్‌వైజర్‌కు మెమో ఇవ్వండి
-జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
మయూరి సెంటర్, సెప్టెంబర్ 16: సీజనల్ వ్యాధులు ప్రభలుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా అదనపు పడకలు ఏర్పాటు చేసి రోగులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పలు వార్డును సందర్శించి రోగులతో మాట్లాడారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున అదనపు పడకలు తక్షణమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం ట్రామాకేర్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. తలసేమియా, వెల్‌నెస్ సెంటర్ వార్డులలో బెడ్‌లు సర్దుబాటు చేసి రోగులకు అందుబాటులో ఉంచాలన్నారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెల్లకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండి ప్రతి రోగికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు జ్వరం భారీన పడగానే డెంగ్యూ అనే భావనతో భయబ్రాంతులకు గురికాకుండా ఉండేందుకు తగు సలహాలు సూచనలు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలోని వంటశాలను సందర్శించి పరిశుభ్రత పాటించాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో వార్డులకు సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో వ్యర్థాలు చెత్త ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతాయని షానిటేషన్ విభాగ ఉద్యోగులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. షానిటేషన్ విభాగ సూపర్‌వైజర్‌కు మెమో జారీ చేయాలని సూపరింటెండెంట్‌ని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఓపీ సేవలలో వైద్యులు ఖచ్చితంగా ఉండి తీరాలని ఆదేశించారు. రోగులకు జ్వరంతో వారికి జ్వరం తగ్గుముఖం పట్టే వరకు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, వైద్యులు విధులను తప్పించుకుని సహాయకులు, స్టాఫ్‌నర్సులు, హెడ్ నర్సులకు అప్పగించి వెళ్లరాదని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యులు, జిల్లా మలేరియా అధికారి సైదులు, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులున్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles