గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి


Tue,September 17, 2019 02:41 AM

-జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు
మధిర, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని రామచంద్రాపురం, జాలిముడి, మల్లారం, మాటూరుపేట గ్రామాల్లో జరుగుతున్న 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యచరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికను రూపొందించారని, ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ భాగస్వాములై గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషిచేయాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలన్నారు. హరి తహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని తెలిపారు. అనంతరం ఆయన ఆయా గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. చిన్నచిన్న సమస్యలపై తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, ఎంపీడీవో రేవతి, ఈవోఆర్డీ రాజారావు, సర్పంచ్‌లు మార్త నరసింహారావు, శివనాగకుమారి, మందడపు ఉపేంద్ర, తడికమల్ల ప్రభాకర్‌రావు, ఎంపీటీసీలు మందడపు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ మండల కార్యదర్శి చిత్తారు నాగేశ్వరరావు, వెలగపూడి శివరాంప్రసాద్, ఎంపీటీసీ రాజశేఖర్, నల్లమల సురేష్, రావూరి శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ వెంక టలక్ష్మీ, సీత, నంబూరి లక్ష్మణ్‌రావు, కనుమూరి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ శీలం వీరవెంకటరెడ్డి, కొఠారి రాఘవరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, చావా వేణు, కోన నరేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల స్పెషల్‌ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles