పల్లెప్రగతిలో ప్రజాప్రతినిధులు పాల్గొనండి


Tue,September 17, 2019 02:41 AM

-సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధిలు పెద్ద ఎత్తున్న పాల్గొన్ని జయప్రదం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సోమవారం స్థానిక క్యాం పు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీ అభివృద్దిల్లో ప్రజలు భాగస్వాములు అయితే ఆ పంచాయతీ అభివృద్ధి చెందుతుందన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని పంచాయతీలను శుభ్రం చేసి అభివృద్ధి చేయటమే లక్ష్యమన్నారు.


కోడెల మృతికి సంతాపం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి బాధాకరమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.రాజకీయంగా ఆయనతో చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సానుభూతి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, చల్లగుళ్ళ నర్సింహరావు, చల్లగుండ్ల కృష్ణయ్య, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేష్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వల్లభనేని పవన్, చాంద్‌పాషా తదితరులున్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles