పడవ ప్రమాద బాధితులకు మంత్రి అజయ్ ఓదార్పు..


Tue,September 17, 2019 02:40 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం, కచ్చులూరు వద్ద గోదావరి నదిలో శనివారం పడవ ప్రమాదం జరిగిన విషయం విధితమే. ప్రమాదంలో తెలంగాన రాష్ట్రం నుంచి ఎక్కువ మంది బాధితులు ఉన్నారని తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. దీంతో మంత్రి అజయ్‌కుమార్ హుటాహుటీన ఆదివారం రాత్రి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పడవ ప్రమాదం జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు.


ప్రమాదం నుంచి బయటపడి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడ వైద్య అధికారులను కోరారు. గోదావరి నదిలో గల్లంతైన వారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, కోస్టు గార్డు బృందాలు విసృత్తంగా గాలిస్తున్నాయి. పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎక్కవ మంది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ నగరాలకు చెందిన వారు ఉన్నారు. పాపికొండల విహార యాత్రకు వెళ్లిన బృందంలో 73 మంది ఉన్నారు. వారిలో 64 మంది యాత్రికులు కాగా మిగితా 9 మంది పడవ సిబ్బంది. పడవ గోదావరి నదిలో కొద్ది దూరం ప్రయాణించిన తరువాత ఒక్కసారిగా సుడిగుండాలో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ప్రమాదంలో 8 మంది దుర్మరణం చేందారని 39 మంది గల్లంతయ్యారని మిగిలిన 26 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అక్కడ బాధితులు మంత్రి అజయ్‌కుమార్‌కు వివరించారు.

రాత్రి మొత్తం బాధితులకు సహాయంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతూ మంత్రి అక్కడ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమిక్షించారు. అక్కడ బాధితులకు అదుతున్న సహాయ సహకారాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియ చేశారు. సంఘటన వివరాలు తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు తమ వారి జాడ తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున సహాయ కేంద్రాన్ని సంప్రదించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి వివరాలు తెలుసుకుని వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు, బంధువులకు వివరాలు తెలిపారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న బాధితుల బంధువులను ఓదార్చి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా అందిస్తుందని వారికి ధైర్యం చెప్పారు.

ఏపీ సీఎంతో కలిసి బాధితులకు పరామర్శ
పడవ ప్రమాదంలో నుంచి బయటపడిన బాధితులు చికిత్స పొందుతున్న వైద్యశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్‌తో కలిసి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరామర్శించారు. వైద్యశాలలో బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. బాధితుకుల అందుతున్న వైద్య సేవలపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారిని సురక్షితంగా హైదరాబాద్, వరంగల్ నగరాలకు పంపించారు. గల్లంతైన వారిలో 6 మృతదేహలను ఎన్‌డీఆర్‌ఎఫ్ సహాయక బృందం వెలికి తీసింది. వాటిలో గుర్తించిన 4 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగితా వారి కోసం ఇంకా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చేస్తున్నాయి. సహాయక చర్యలను మరింత పెంచాలని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి ఎం.సుచరితను కోరారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్లు కమర్తపు మురళీ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, పగడాల నాగరాజు, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ వెంకటరమణ, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, నాయకులు బచ్చు విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.

ఖమ్మం, నల్గొండ జిల్లాల బాధితులను పరామర్శించిన మంత్రి అజయ్..
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్టణం కచ్చులూరు గ్రామం వద్ద గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగిన విషయం విధితమే. అక్కడ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులైన వారికి సహాయ సహాకారాలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి హుటాహుటీన రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు. బోటు ప్రమాదంలో గల్లంతైన ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రేపాకుల విష్ణు తండ్రి సూరయ్య, నల్గొండ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన తరుణ్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోమవారం రాజమండ్రి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానితో కలిసి బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యసేవలు అందుతాయని భరోసా కల్పించారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles