బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు..


Tue,September 17, 2019 02:40 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం, కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల వారు ఉన్న విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను రాజమండ్రి వెళ్లి బాధితులకు తగు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించారు. దీంతో ఖమ్మంలో పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్న మంత్రి అజయ్‌కుమార్ ఆదివారం రాత్రి రాజమండ్రి చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. మంత్రి అజయ్‌కుమార్‌ను చూసిన బోటు ప్రమాద బాధితులు కన్నీరు.. మున్నీరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా పాపికొండల వద్ద పడవ ప్రమాద బాధితులను తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు హుటాహుటీన రాజమండ్రి వెళ్లారు. అనంతరం ఆయన ప్రమాద సంఘటన వివరాలు ప్రమాదం నుంచి బయటపడిన వరంగల్ జిల్లా వాసులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. బాధితులను వివరాలు అడుగుతూ వారిలో ధైర్యం నింపారు. కాగా సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హోం మంత్రి సుచరితలు మరికొందరు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి రాజమండ్రి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి బోటు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెలంగాణ మంత్రి ఏపీ ముఖ్యమంత్రితో కలిసి మరోసారి వైద్యశాలలో కలయతిరిగారు. గుర్తించిన మృతదేహాలకు పోస్ట్‌మర్ట్ చేయించి వారి బంధువులకు అప్పగించి వారి స్వగ్రామం చేరేలా ఏర్పాటు చేశారు. పువ్వాడ అజయ్‌కుమార్ వైద్యసౌకర్యాలపై ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని అధికారులు, డాక్టర్స్‌తో సమన్వయం చేసుకుంటూ అన్నీతానై క్షతగాత్రులకు వైద్యచికిత్సపై శ్రద్ధ చూపెట్టుతున్నారు. గల్లంతనై వారి ఆచూకి కోసం సోమవారం రాత్రి కూడా రాజమండ్రిలోనే బసచేయనున్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles