కోలిండియా స్థాయిలో ప్రతిభ చూపాలి


Mon,September 16, 2019 01:06 AM

కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కార్పొరేట్ ఏరియా వర్క్‌పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ఏరియా డిపార్ట్‌మెంట్ స్థాయి వార్షిక ఇండోర్ క్రీడాపోటీలు స్థానిక కేసీవోఏ క్లబ్‌లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు జీఎం పర్సనల్ వెల్ఫేర్ కే.బసవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రమశిక్షణతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కోలిండియా స్థాయిలో సింగరేణి సంస్థ క్రీడలను కీర్తిని పతాకాన్ని ఎగురవేయాలని సీనియర్ క్రీడాకారులు యువక్రీడాకారులకు మెళకువలు నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ వెల్ఫేర్ డీ.సాల్మన్, డీజీఎం పర్సనల్ ధన్‌పాల్, టీబీజీకేఎస్ వైస్‌ప్రసిడెంట్ ఎం.సోమిరెడ్డి, సీఎంవోఏఐ ప్రసిడెంట్ ఎఆర్‌జీకేమూర్తి, సీనియర్‌పీవో, డబ్ల్యుపీఎస్ అండ్ జీఏ సెక్రటరీ శ్రీకాంత్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు సుందర్‌రాజ్, ఎంసీ.పోస్‌నెట్, కోర్టినేటర్ కెఆర్‌ఎల్‌రెడ్డి, కెప్టెన్ ఎం.శ్రీనివాస్, డీ.సతీ ష్, రామ్‌ప్రసాద్, షరీఫ్ క్రీడాకారులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles