కంచర్ల గోపాలకృష్ణ మృతి


Mon,September 16, 2019 01:05 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ సోదరుడు కంచర్ల గోపాలకృష్ణ (65) ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విజయవాడలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో గోపాలకృష్ణ సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గతంలో గోపాలకృష్ణ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. గోపాలకృష్ణ అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాల్లో విషాదాన్ని నింపింది. జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, గోపాలకృష్ణ సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు వనమా రాఘవేంధర్‌రావు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, సినిమా థియేటర్స్ యజమానులు, పట్టణంలోని వ్యాపారస్తులు, విద్యా సంస్థల యాజమాన్యాలు గోపాల కృష్ణ మృతికి సంతాపం తెలిపి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles