మున్నేరులో ఈతకు వెళ్లి యువకుడి మృతి


Sat,September 14, 2019 11:59 PM

ఖమ్మం క్రైం, సెప్టెంబర్ 14 : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని బొక్కల గడ్డ ప్రాంతంలోని మున్నేరు వాగులో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. త్రీటౌన్ పోలీసుల కథనం మేరకు చెరువుబజార్ ప్రాంతానికి చెందిన షేక్ ముబీన్ (19), షేక్ మతీన్ (17) ఇద్దరు యువకులు మధ్యాహ్నం 3 గంటలకు మున్నేరులో ఈత కొట్టడానికి వెళ్లారు. మున్నేరు వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో షేక్ ముబీన్ కొట్టుకుపోయాడు. షేక్ మతీన్‌ను అక్కడ ఉన్న చేపలు పట్టేవారు కాపాడారు. కొద్ది దూరంలో షేక్ ముబీన్ మృతదేహం దొరకడంతో మృతదేహాన్ని ప్రభుత్వ మార్చురీకి పోస్టుమర్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles