జాతీయ లోక్ అదాలత్‌లో 663 కేసుల పరిష్కారం


Sat,September 14, 2019 11:59 PM

ఖమ్మం లీగల్, సెప్టెంబర్ 14 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 663 కేసులు పరిష్కారమయ్యాయి. ఖమ్మంలో 7వ అదనపు జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ 45 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి, కక్షిదారులకు రూ.1.24కోట్ల పరిహారం ఇప్పించారు. న్యాయసేవాసంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్ బ్యాంకు కేసులు, ఇతర సివిల్ కేసులను పరిష్కరించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ దాఖలు చేసిన 17 రుణ వసూలు కేసులు పరిష్కామయ్యాయి. న్యాయమూర్తులు ఎన్ అనితారెడ్డి, ఎం జయమ్మ, ఎం ఉషశ్రీ, రుబీనాఫాతిమా క్రిమినల్ కేసులను పరిష్కరించారు. ఖమ్మంలో 233 క్రిమినల్ కేసులు, 77 సివిల్ కేసులు పరిష్కారం కాగా, కొత్తగూడెంలో 114, సత్తుపల్లిలో 41, మధిరలో 52, భద్రాచలంలో 59, మణుగూరులో 64, ఇల్లెందులో 23 కేసులు పరిష్కారమయ్యాయి. ఇన్‌చార్జ్ జిల్లా జడ్జి బాలభాస్కర్‌రావు జాతీయ లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles