పల్లెలు కళకళలాడాలి


Sat,September 14, 2019 12:44 AM

-రెబ్బవరం ప్రగతి ప్రణాళిక సభలో మంత్రి అజయ్‌కుమార్
-ఉమ్మడి జిల్లాలో జోరుగా 30 రోజుల కార్యక్రమం
-హరితహారంలో పాల్గొన్న మంత్రి, ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములునాయక్
-గ్రామాభివృద్ధికి ముందుకొస్తున్న దాతలు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గతపాలకుల హయాంలో ధ్వంసమైన గ్రామీణ వ్యవస్థను తిరిగి గా డిలో పెట్టేందుకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి పల్లెల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 6న ప్రారంభమై జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. తమ పల్లెలను తామే బాగు చేసుకుంటామని ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో కార్యాచరణ ప్రణాళికలో పాల్గొంటున్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు లేక పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కార్యాచరణ ప్రణాళికలో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యంతో వాటిని నిర్మించుకొని పల్లె సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామాల్లో దాతలు ముందుకొస్తున్నారు.

అన్ని గ్రామాల్లో కార్యాచరణ ప్రణాళిక
సుజాతనగర్ మండలం నుంచి పాల్వంచ మండలం జగన్నాథపురం వరకు రహదారులకు ఇరువైపులా, డివైడర్లలో మొక్కలు నాటడం, గుంతలు తీసేకార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. కొత్తగూడెం పట్టణంలో డీఆర్‌డీఏ పీడీ ఆధ్వర్యంలో గుంతలు తీసే పనులు ప్రారంభించారు. రెవెన్యూ ప్లాంటేషన్ కోసం అటవీశాఖ ద్వారా మొక్కలు సమకూర్చుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎనిమిది రోజులుగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో డ్రైన్లు శుభ్రం చేయడం, రహదారుల వెంబడి పిచ్చిమొక్కలు తొలగించడం, బురదమయంగా ఉన్న రహదారులకు మట్టి తోలడం, నీరు నిల్వఉండే ప్రాంతాల ను గుర్తించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, దోమల వ్యాప్తిని నివారించేందుకు మురికి గుంతల్లో ఆయిల్‌బాల్స్ వేయడం, శిథిలావస్థలో ఉన్న పాడుబడిన భవనాలను కూల్చివేయడం, గ్రామాల్లో పశువుల పెంటదిబ్బలను తొలగించడం తదితర కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఆరుబయట వ్యర్థాలు వేసేవారిపై రూ.500 జరిమానా విధించనున్నారు. జరిమానా చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు కోసం అధికారులు స్థలాలను పరిశీలిస్తున్నారు. సేకరించిన భూముల వివరాల నివేదికలను అందజేసి, ప్రతీ రోజు కార్యక్రమాలపై ప్రొఫార్మా ప్రకారం తయారుచేసిన నివేదికలను ప్రత్యేక అధికారులు కలెక్టర్‌కు అందజేయనున్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles