తాలిపేరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

Sat,September 14, 2019 12:42 AM

చర్ల రూరల్/పాల్వంచ రూరల్: చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు నుంచి 5 గేట్లు ఎత్తి 14,025 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి గురువారం సాయంత్రం భారీగా వచ్చిన వరద శుక్రవారం ఉదయానికి తగ్గుముఖం పట్టింది. దీంతో గురువారం 11 గేట్లు ఎత్తిన అధికారులు శుక్రవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో 6 గేట్లు దించి 5 గేట్లు 5 అడుగుల మేర ఎత్తిపెట్టి 14,025 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 14,320 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందని తాలిపేరు ప్రాజెక్టు డీఈఈ తిరుపతి తెలిపారు.

కిన్నెరసాని నుంచి ఏడువేల క్యూసెక్కులు విడుదల
పాల్వంచ రూరల్ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి ఏడువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కులు ఉంది. ఉదయం నీటిమట్టం 406 అడుగుల నుంచి సాయంత్రానికి 406.3 అడుగులకు చేరింది. దీంతో రిజర్వాయర్‌లో వచ్చి చేరుతున్న వరదనీటిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లను ఎత్తి ఏడువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

23
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles