ఎస్టీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన ఐటీడీఏ పీవో

Sat,September 14, 2019 12:42 AM

బూర్గంపహాడ్: బూర్గంపహాడ్ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలను, కిచెన్, స్టోర్‌రూంలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం వార్డెన్, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు అందించే బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులతో మాట్లాడారు. హాస్టల్‌లో గ్రౌండ్ సౌకర్యం లేదని, విద్యార్థులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆటలు ఆడిపించాలని పీఈటీకి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం పీవో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రవికుమార్, ఆర్‌ఐ రాంబాబు, సర్పంచ్ సిరిపురం స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles