సిబ్బంది పనితీరు మార్చుకోవాలి

Sat,September 14, 2019 12:41 AM

టేకులపల్లి: మండలంలో సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తనిఖీ చేశారు. మండలంలో కొన్ని రోజులుగా పలు గ్రామాల్లో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో శుక్రవారం ఆయన అకస్మాత్తుగా తనిఖీ చేశారు. మండలంలో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలపై సిబ్బంది అనుసరిస్తున్న పని తీరును అక్కడున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలో కొంతమంది రోగులు వైద్య సేవలు అందించే సమయంలో వైద్యులు విసిగించుకుంటున్నారని రోగులు ఫిర్యాదు చేశారు. అలాగే హాస్పటల్ సిబ్బంది తమపై కూడా డాక్టర్ దురుసుగా ప్రవర్తిస్త్తున్నాడని తెలిపారు. దీనిపై జిల్లా చైర్మన్ మాట్లాడుతూ.. వైద్య సేవలందించడంలో ప్రవర్తన లో మార్చుకోవాలని, లేకపోతే చర్యలుంటాయని కోరం హెచ్చరించారు. ఈసందర్భంగా హాస్పటల్ ఆవరణంలో అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి సిబ్బందిని మందలించారు. కార్యక్రమంలో టేకులపల్లి మాజీ జడ్పీటీసీ లక్కినేని సురేందర్‌రావు, సర్పంచ్ మాలోత్ సురేందర్, అజ్మీరా శివ, రాజు, వివిధ గ్రామల నుంచి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles