పాసుపుస్తకాల్లో అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి

Sat,September 14, 2019 12:41 AM

-కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: పాస్‌పుస్తకాల్లో అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ శుక్రవారం కోరారు. పట్టా పాసుపుస్తకాలు, భూ ఖాతాల వివరాలను పరిశీలన కోసం వీలుగా ఆయా రెవెన్యూ గ్రామాల పరిధిలోని పంచాయతీ కార్యాలయాల్లో 1బీ జాబితాను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా పరిశీలన చేసుకొని అభ్యంరాలుంటే సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజలు తెలుసుకోవడానికి అధికారులు ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు ఎవరైనా లంచం అడిగితే కలెక్టర్ కార్యాలయనందు ఏర్పాటు చేసిన 08744-241950కు, 949063 6555నెంబర్ కానీ, జిల్లా రెవెన్యూ అధికారి 7995571866 నెంబర్‌కు లంచాలు అడిగినవారి వివరాలను వాట్సాప్ ద్వారా వివరాలు తెలపాలని సూచించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles