బయోమెట్రిక్ హాజరు నమోదు పూర్తి కావాలి

Sat,September 14, 2019 12:41 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఏటీడీవోలు నిర్లక్ష్యం కారణంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ, వసతి గృహాల్లోని విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు నమోదు పూర్తి కావాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూవోలతో బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు ప్రక్రియపై పీవో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌లు సమయ పా లన పాటించి ఆశ్రమ పాఠశాలల, వసతి గృహాల్లోని వి ద్యార్థులు డ్రాపౌట్ కాకుండా చూడాలని చెప్పారు.

ఏటీడీవోలు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలని, మ ర్కోడు వసతి గృహంలోని వార్డెన్ పనితీరు మార్చుకోవాలని, డ్రాపౌట్ అయిన 20 మంది పిల్లలను వెంటనే వారి ఇంటికి తీసుకొచ్చి బయోమెట్రిక్ చేయించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంత వరకు ఈ హాస్టల్‌లో శిక్షణ ఇచ్చిన అప్‌గ్రేడ్ చేయని వారికి వెంటనే మెమోలు జారీ చేయాలని డీటీడీవోను ఆదేశించారు. పాల్వంచలోని హాస్టల్ వార్డెన్ పనితీరు బాగాలేనందున అతన్ని అక్కడి నుంచి తొలగించి వేరే వారిని నియమించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు నమో దు కాని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పీవో వీపీ గౌతమ్ హెచ్చరించారు. డీటీడీవో జహీరుద్దీన్, పీఎంఆర్‌సీ భావ్‌సింగ్, సంబంధిత ఏటీడీవోలు, హెచ్‌ఎం, వార్డెన్‌లు, ఎంప్లాయిమెంట్ అధికారిణి సంధ్య పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles