కొత్త వాహన చట్టం..

Sun,August 25, 2019 01:02 AM


-వాహనదారులూ తస్మాత్ జాగ్రత్త
-నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులకు చిల్లే
-మద్యం తాగి వాహనం నడిపిస్తే అంతే సంగతులు..!
-మైనర్లకు వాహనం ఇస్తే పెద్దలకు జరిమానా

కొత్తగూడెం క్రైం: పార్లమెంట్‌లో ఈ ఏడాది ఆగస్టు 9న ఆమోదం పొందిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను అమలులోకి తసుకురానున్నారు పోలీస్, రవాణా శాఖ అధికారులు. వాహనదారులు ఇకపై రోడ్డెక్కాలంటే ఖచ్చితమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్‌పై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పోలీస్ అధికారులు విధించే భారీ జరిమానాలతో జేబులకు చిల్లులు పడటం ఖాయం. ఈ చట్టం ప్రకారం రూ.500 నుంచి రూ.25 వేలు, రూ.లక్ష వరకూ జరిమానా చట్టం ద్వారా అధికారులు విధిస్తారు. ఒకవేళ వాహనదారుడు తాను ఎవరి కంటా పడకుండా.. రాంగు రూటులో వెళ్లానని ఊపిరి పీల్చుకంటే పొరపాటే.. మద్యం తాగి వాహనం నడిపే వాహనదారులు పోలీస్ స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా తప్పనట్లే..! అదేవిధంగా మైనార్టీ తీరని పిల్లలకు వాహనం ఇచ్చే గార్డియన్‌కు కానీ, వాహన యజమానికి కానీ రూ.25 వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడనుంది. వాహన లైసెన్స్‌ల విషయంలో నిబంధనలకు ఉల్లంఘిస్తే రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంది. రోడ్లపై అమర్చిన నిఘానేత్రాల ద్వారా నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులను మానిటరింగ్ సిబ్బంది గుర్తించి జరిమానా విధిస్తారు.

చట్టం అమలుకు
పోలీస్ అధికారుల కసరత్తు
మోటార్ వాహన (సవరణ) చట్టం 2019 ద్వారా ఆమోదం పొందిన కొత్త చట్టాన్ని ఖచ్చితమైన నిబంధనలతో జిల్లాలో అమలు చేసేందుకు పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఎస్పీ సునీల్ దత్ నేతృత్వంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు భద్రాచలం, ఇల్లెం దు, మణుగూరు, పాల్వంచ సబ్ డివిజన్లలో పోలీస్ అధికారులు ఇప్పటినుంచి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వాహనదారులకు ఆయా మోటార్ వాహ న చట్టంలో అమలైన సాధారాణ జరిమానాలు, శిక్షలతో సరిపెట్టిన అధికారులు, ప్రస్తుతం అమలులోకి రానున్న కొత్త చట్టం ద్వారా కఠినమైన నిబంధనల విషయంలో చర్యలు తీసుకోనున్నారు. కొత్తగూడెం డీఎస్పీ ఎస్.ఎం.అలీ నేతృత్వంలో త్రీటౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ లింగనబోయిన ఆదినారాయణ వాహనదారులకు నిబంధనల ఉల్లంఘనలపై విధించే జరిమానాలను ఫ్లెక్సీ రూపంలో తయారు చేయించి త్రీటౌన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఈ చట్టాల అమలు విషయంపై వినూత్నమైన కార్యక్రమాలను పోలీస్ అధికారులు చేపడుతున్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles