కల్తీ పెట్రోల్ పోశారని వినియోగదారుని ఆందోళన

Sun,August 25, 2019 12:59 AM

మణుగూరు రూరల్: కల్తీ పెట్రోల్ పోశారంటూ మణుగూరు పట్టణంలోని జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వినియోగదారుడు శనివారం ఆందోళన నిర్వహించారు. మణుగూరు మున్సిపాలిటీలోని శివలింగాపురం గ్రామానికి చెందిన లంకా మహేష్, ఈ నెల 21న తన యమహా ఆర్15 ద్విచక్ర వాహనంలో రూ.300 పెట్రోల్ కొట్టించుకున్నాడు. వర్షం పడుతున్నదంటూ తన వాహనాన్ని ఇంట్లోనే ఉంచాడు. శనివారం బైక్‌ను స్టార్ట్ కాకపోవడంతో అనుమానమొచ్చింది. పెట్రోల్‌ను బాటిల్‌లోకి తీశాడు. అందులో నీళ్లు కూడా ఉండడంతో వెంటనే పెట్రోల్ బంక్ వదదకువెళ్లి ఆందోళనకు దిగాడు.

ఇంతలో అక్కడకు చేరుకున్న సీపీఎం నాయకులు వచ్చారు. వారు ఇచ్చిన సమాచారంతో మణుగూరు తహసీల్దార్ మంగీలాల్ వచ్చారు.బాటిల్‌లోని పెట్రోల్‌ను పరిశీలించారు. ఆ వినియోగదారుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. బంక్ అనుమతి పత్రాలు పరిశీలించారు. వినియోగదారుడు తీసుకొచ్చిన పెట్రోల్ బాటిల్‌ను సివిల్ సైప్లె అధికారులకు పంపించి టెస్ట్ చేయిస్తామన్నారు. కల్తీ జరిగినట్టుగా తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles