సమష్టి కృషితో లక్ష్యాలను సాధించాలి

Sun,August 25, 2019 12:59 AM


మణుగూరు, నమస్తే తెలంగాణ: సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలోని కార్మికులు, అధికారులు సమష్టి కృషితో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించి, ప్రత్యేకతను చాటుకోవాలని జీఎం (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) సత్తయ్య కోరారు. ఆయన శనివారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఏరియా జీఎం జక్కం రమేష్, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సత్తయ్య మాట్లాడుతూ.. 2020-21 సంవత్సరానికి మణుగూరు ఏరియాలో గనులవారీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణయించడానికి సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నీటి ప్రాజెక్టులు నిర్వహించడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరం సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 75 మిలియన్ టన్నులుగా నిర్ణయించనన్నట్టు చెప్పారు. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

మణుగూరు ఏరియా గనుల విస్తరణకు పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకున్నట్టు చెప్పారు. భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయిందన్నారు. ఈ సమావేశంలో ఎస్వో టు డైరెక్టర్ దేవికుమార్, జీఎం (సీపీపీ) రాజేశ్వరరెడ్డి, ఏజీఎం సురేష్‌బాబు, డీజీఎం(పీపీ) శ్రీహరి, డీజీఎం(ఐఈడీ) బి.రవి, డీజీఎం(కార్పొరేట్) వీరభద్రం, ఏరియా ఇంజినీర్ బస్విరెడ్డి, మణుగూరు ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ లలిత్‌కుమార్, పీకేఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మిపతి గౌడ్, కేపీయూజీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్.వెంకటరమణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఎలీష, మేనేజర్ నర్సింహస్వామి, రాముడు, రాంబాబు, సురేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles