నూతన ఆవిష్కరణలతోనే అభివృద్ధి..

Sun,August 25, 2019 12:58 AM

ఖమ్మం కల్చరల్: నూతన పరికల్పనలు, ఆవిష్కరణలతోనే అభివృద్ధి ముడిపడి ఉందని, ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రోటరీక్లబ్ ఆఫ్ స్తంభాద్రి, ఖమ్మం జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ సంయుక్తంగా భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ఇంపాక్ట్-19 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందాలంటే విద్యార్థులు, యువత నూతన పరికల్పనలు, ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే నిజాయితీ, నిబద్ధత ఉండాలన్నారు. ఏదైనా సాధించగలిగే శక్తి యువతకే ఉంటుందన్నారు. కెరీర్‌కు వివాహం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు మరేవీ అడ్డురావని, వీటన్నింటిని అధిగమించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే జీవితమని ఏపీ అడిషనల్ ఎస్పీ సరిత అన్నారు. విద్యార్థులు, యువత ఎదగాలంటే పంచ సూత్రాలు ఆచరించాలన్నారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు.

ప్రముఖ యోగ గురువు జగన్ గురూజీ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మానవ నాగరికతకు ఆయువన్నారు. యోగ, ధ్యానం మానసిక ధైర్యానికి, పరిష్కారానికి చక్కటి మార్గాలన్నారు. ప్రతి ఏడాది ఇంపాక్ట్ నిర్వహిస్తూ, విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో రోటరీక్లబ్ ప్రముఖ పాత్ర వహించడం గర్వకారణమని ప్రోగ్రాం కన్వీనర్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ పేర్కొనారు. కార్యక్రమాన్ని వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు, ప్రోగ్రాం కన్వీనర్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ వేములపల్లి సీతారాంబాబు పర్యవేక్షించారు. నిర్వాహకులు విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్, భోజన సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు చెరుకూరి యుగంధర్, కార్యదర్శి బొమ్మిడి సునీల్, జర్నలిస్ట్ ప్రసేన్, ఎన్‌ఆర్‌ఐ జిల్లా అధ్యక్షుడు బోనాల రామకృష్ణ, నాగేశ్వరరావు, రంగారావు, పాలవరపు శ్రీనివాసరావు, నాగసాయి నగేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles