వైద్యసిబ్బందిని నియమించాలి

Sun,August 25, 2019 12:58 AM

-మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు, నమస్తేతెలంగాణ: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నమస్తె తెలంగాణతో ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ.. మణుగూరు వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వైద్యులను, అవసరమైన సిబ్బందిని కేటాయించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ప్రముఖ న్యాయవాది, పార్టీ సీనియర్ నాయకుడు పొనుగోటి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles