రెండు నెలకోసారి ఫ్యామిలీడే..

Sun,August 25, 2019 12:58 AM

-మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్
మణుగూరు, నమస్తేతెలంగాణ : ప్రతీ రెండు నెలలకోసారి మణుగూరు ఏరియా సీఈఆర్‌క్లబ్‌లో ఫ్యామిలీడే వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఏరియా జీఎం జక్కం రమేశ్ అన్నారు. మణుగూరు ఏరియా పీవీకాలనీ సీఈఆర్‌క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కమ్యూనిటీహాల్‌లో నిర్వహించిన ఫ్యామిలీడే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇకనుంచి సీఈఆర్‌క్లబ్ కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. అనంతరం మణుగూరు ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల సమస్యలు, సౌకర్యాలపై ఏరియా జీఎం సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. తొలుత విద్యార్థులు, యువత సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్ణచందర్‌రావు మిమిక్రీ అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏరియా సేవా అధ్యక్షురాలు వాణిరమేష్, డీజీఎం(పర్సనల్) రేవు సీతారాం, డీజీఎం(పైనాన్స్) వెంకటరమణ, వెల్ఫేర్ ఆఫీసర్లు సింగు శ్రీనివాస్, రామేశ్వరరావు, యూనియన్ నాయకులు, సేవా సభ్యులు, క్లబ్‌సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles