తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్..

Sun,August 25, 2019 12:57 AM

చండ్రుగొండ: జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్ పార్టీ తయారైందని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జీ, రాష్ట్ర కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ సముదాయాన్ని శనివారం చండ్రుగొండ మండల పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి నరేశ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ గ్రామ, మండల కమిటీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. పార్టీ పటిష్టతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. త్వరలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తాను చాటుతుందన్నారు. ప్రభుత్వ అభివృద్ద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ ప్రజాప్రతినిధిపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్యనాయక్, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యన్నారాయణ, సంగొండి రాఘవులు, గొరంట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles