సమన్వయంతో పని చేయండి

Sun,August 25, 2019 12:57 AM

అశ్వారావుపేట, నమస్తే తెలంగాణ : వైద్యులు, సిబ్బందితో కలిసి నమన్వయంతో పనిచేయాలని, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కర్‌నాయక్ సూచించారు. అశ్వారావుపేట మండలంలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఊట్లపల్లిలో ర్యాపిడ్ ఫీవర్ సర్వేను పర్యవేక్షించి, సర్వేలో తీసుకుంటున్న జాగ్రత్తలను తనిఖీ చేశారు. వినాయకపురంలో ఈనెల 26నుంచి ప్రారంభమయ్యే లెప్ర సీ, క్షయ వ్యాధిగ్రస్తుల సర్వే శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. సర్వేలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్వే విధానంపై సూచనలు చేశారు. అనంతరం సున్నంబట్టి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏఎన్‌ఎం వగ్గెల జ్యోతి ని పరామర్శించారు. గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో పర్యటించి పరిశుభ్రతపై సూచనలు అందించారు.

సీజనల్ వ్యాధు ల నివారణకు విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని స్పష్టం చేశారు. అనంతరం కొత్తమామిళ్లవారిగూడెం, తిరుమలకుంట, రెడ్డిగూడేన్ని సందర్శించి, జ్వరపీడితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనుమానితుల నుంచి సకాలంలో రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపించాలని, మలేరియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సూపర్‌వైజర్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రాజు ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles