ఎస్‌బీఎంపై ప్రజాభిప్రాయ సేకరణ

Sun,August 25, 2019 12:57 AM

కొత్తగూడెం అర్బన్ : స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్‌బీఎం)పై కేంద్ర తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తోందని డీఆర్‌డీవో పీ జగత్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్మాణంపై కేంద్రప్రభుత్వం మోబైల్ యాప్ ఇచ్చిందన్నారు. జిల్లాలోని ప్రజలందరూ స్మార్ట్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి ఎస్‌బీఎం-2019 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అందులో అడిగే నాలుగు ప్రశ్నలకు అమూల్యమైన అభిప్రాయాలు తెలపాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800572011 2కు ఫోన్ చేసి అభిప్రాయాలు తెలపాలని ప్రజలను కోరారు. జిల్లాలోని యువతీ యువకులు, ప్రజలందరూ విరివిగా భాగస్వాములై జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles