12వ వేతన ఒప్పందం అమలు చేయాలని అర్ధనగ్న ప్రదర్శన

Sat,August 24, 2019 02:05 AM

బూర్గంపహాడ్: 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ మండల పరిధిలోని సారపాక ఐటీసీ టైమ్ ఆఫీస్ ఎదుట జేఏసీ కార్మికులు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గత నెల రోజులుగా 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికి ఐటీసీ సంస్థ స్పందించడకపోవడం బాధాకరమన్నారు. ఇందుకు నిరసనగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంస్థ స్పందించి కార్మికులకు మంచి వేతన ఒప్పందం అమలు చేయాలని, మెడికల్ అలవెన్స్‌లు తదితర వాటిని అమలు చేయాలని వారు కోరారు. వేతన ఒప్పందం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కనకమేడల హరిప్రసాద్, కోకన్వీనర్లు గల్లా నాగభూషయ్య, గాదె రామకోటిరెడ్డి, అబ్దుల్‌షబీర్, నాయకులు మహేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, శరత్, చలపతి, రఫీ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles