పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం

Sat,August 24, 2019 02:04 AM

పాల్వంచ రూరల్: మండలంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఉదయం ఆలయం ఎదురుగా ఉన్న అమ్మవారి జన్మస్థలం వద్ద మేళతాళాలలో ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ, గాజులు, ఒడిబియ్యం సమర్పించారు. ఆలయంలోని మూలవిరాఠ్‌కు పంచామృతాలతో అభిషేకం జరిపారు. పాలు, తేనే, పెరుగు, నెయ్యి, పంచదార లతో కూడిన అభిషేకాన్ని పండితులు వేద మంత్రోచ్ఛరణలతో భక్తుల సమక్షంలో నిర్వహించారు. పంచహారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం జరిపారు. తిలకించేందకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles