నేనూ ఖమ్మం వాసినే..

Sat,August 24, 2019 02:04 AM

-ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈ స్థాయికి..
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్
ఖమ్మం కల్చరల్: తాను 1959లో ఖమ్మం నయాబజార్ పాఠశాలలో చదువుకున్నానని, ఈ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉందని ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. శుక్రవారం రోటరీక్లబ్ ఇంపాక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. ఒక చిన్న గదిలో పేదగా గడిపిన ఆ క్షణాలు ఇప్పటికీ కళ్లల్లో మెదులుతుంటాయన్నారు. ఒక రూపాయి సేవింగ్‌తో ఒక రూపాయి ఎర్నింగ్ అనే సూత్రాన్ని నమ్మేవాడినని, అందుకే చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు తానే స్వయంగా క్షవరం చేసుకుంటున్నానని అన్నారు. తాను డిప్రెషన్‌లో ఉన్న సమయంలో తన తండ్రి ఒక సలహా ఇచ్చారని, ఒక మంచి స్నేహితుడితో మాట్లాడమన్నారని, తానే ఆ స్నేహితుడు కావడం, ప్రతి రోజు అద్దం ముందు తనతో మాట్లాడుకోవడం ఎన్నోసార్లు జరిగిందన్నారు. ప్రతీ మనిషిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, తనలో దాగి ఉన్న రైటర్‌తో ప్రతి రోజు మాట్లాడుకుంటూ ఎదిగానన్నారు. లాటిన్‌లో ఇంటర్మీడియట్ అంటే ఇన్ మిడిల్ అని అర్థమని, ఆ దశలో ఉన్న విద్యార్థులు తమ జీవితాన్ని ఉన్నతంగా నిర్మించుకోవడానికి తగు లక్ష్యాన్ని ఎంచుకోవాలన్నారు. పిల్లలు కాసేపు ప్రేమతో తల్లిదండ్రులతో మాట్లాడాలని, మానవ, కుటుంబ సంబంధాలు తగ్గిపోతే భవిష్యత్ ప్రమాదకరంగా తయారవుతుందన్నారు. తన నవలలను అనేక సినిమాలు చేసిన చిరంజీవికి తానే మెగాస్టార్ బిరుదు ఇవ్వడం చిత్ర పరిశ్రమలోనే చారిత్రాత్మకమైందన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles