తాలిపేరు 4 గేట్ల ఎత్తివేత..

Sat,August 24, 2019 02:03 AM

చర్ల రూరల్: చర్ల మండల పరిధిలోని మధ్యతరహా సాగునీటి తాలిపేరు ప్రాజెక్టుకు మళ్లీ స్వల్పంగా వరద తాకిడి తగిలింది. దీంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు 5 అడుగులు ఎత్తిపెట్టి 12,235 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదిలేశారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 12 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తున్నట్లుగా తాలిపేరు ప్రాజెక్టు ఇన్‌చార్జి ఏఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. డ్యామ్‌లో 73.05 మీటర్ల నీటిని నిల్వచేసి ఎగువ నుంచి వస్తున్న అదనపు వరదనీటిని అవసరమైన మేరకు గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం డ్యామ్‌లో వరద నిలకడగా ఉందని, శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో రాత్రికి వరద కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల ద్వారా 280 క్యూసెక్కుల నీటిని పంట పొలాలకు విడుదల చేస్తున్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles