సింగరేణిలో హరిత వికాసం..

Fri,August 23, 2019 04:29 AM

-అడవులే జీవకోటి మనుగడకు మూలం....
-హరితహారం లక్ష్యసాధనకు సింగరేణి ప్రధాన భూమిక...
-సింగరేణి సంస్థ డైరెక్టర్(ఫైనాన్స్) బలరాం..
-పండుగలా హరితహారం..
-మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేష్
-సింగరేణి హరిత సంకల్పం అభినందనీయం
-మణుగూరు ఎఫ్‌డీవో దామోదర్‌రెడ్డి

మణుగూరు, నమస్తే తెలంగాణ: అడవులే జీవకోటి మనుగడకు మూలమని, దట్టమైన అడవులు ఉంటేనే వర్షాలు బాగా పడుతాయని, అందరి సహకారంతో సింగరేణి వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నదని సింగరేణి సంస్థ డైరెక్టర్(ఫైనాన్స్) ఎన్.బలరాం అన్నారు. గురువారం సింగరేణి సంస్థ మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో మణుగూరు ఓసీ సమీపంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ డైరెక్టర్(ఫైనాన్స్) ఎన్.బలరాం పాల్గొన్నారు. మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. అడవులు అంతరించిపోతున్నాయన్నారు. వర్షాలు రావాలంటే మొక్కలు పెంచాలని, వాతావరణ సమతుల్యతను కాపాడుకోవాలని అన్నారు. హరితహారం లక్ష్య సాధనకు సింగరేణి సింస్థ ప్రధాన భూమిక పోషిస్తున్నదన్నారు. హరితహారం నిర్వహణలో సింగరేణి సంస్థ ముందు వరసలో ఉందని ఇప్పటి వరకు నాటిన మొక్కల్లో 80 శాతం మొక్కలు ఉన్నాయన్నారు. మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేష్ మాట్లాడుతూ..

సింగరేణివ్యాప్తంగా పండుగలా హరితహారం కార్యక్రమం సాగుతున్నదన్నారు. మణుగూరు ఏరియాకు ఇచ్చిన ఐదులక్షల మొక్కలు లక్ష్యానికిగాను ఇప్పటికే రెండులక్షల మొక్కలు నాటినట్టు చెప్పారు. మణుగూరు ఏరియాలో హరితోత్సాహం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు. నాటిన ప్రతి మొక్కను రక్షించే బాధ్యతను తీసుకున్నామన్నారు. మణుగూరు ఎఫ్‌డీవో డి. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది సింగరేణి సంస్థ యాజమాన్యం కోటీ మొక్కలు నాటి పెంచాలనే సంకల్పం అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థ భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులను, ఉద్యోగులను కూడా భాగస్వాములు చేయడం ఎంతో అభినందనీ యమన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈ వెంకటేశ్ మాట్లాడుతూ.. జిల్లాలో హరితహారం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదన్నారు. సింగరేణి సంస్థ హరితహారం లక్ష్యసాధనకు సింగరేణి ప్రధాన భూమిక పోషించాలన్నారు. రహదారులన్నీ కలర్‌ఫుల్‌గా ఉండేలా అన్ని రకాల మొక్కలను నాటాలన్నారు.

స్ఫూర్తిని నింపిన డైరెక్టర్ (ఫైనాన్స్)
ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా నాలుగు ఎకరాల్లో 1500 మొక్కలను నాటారు. ఇందులో డైరెక్టర్ (ఫైనాన్స్) స్వయంగా 306 మొక్కలు నాటి స్ఫూర్తి నింపారు. ఇప్పటివరకు ఆయన సింగరేణిలో జరగే ప్రతి కార్యక్రమంలో స్వయంగా మొత్తం 4015 మొక్కలు నాటారు. ఆయనను ఏరియా సేవాసమితి అధ్యక్షురాలు వాణీరమేష్ ఆధ్వర్యంలో సభ్యులు, మణుగూరు ఓసీ అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మణుగూరు ఏరియా సీఎంవోఏ అధ్యక్షులు, మణుగూరు ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డి.లలిత్‌కుమార్, ఏరియా గుర్తింపు సంఘం నాయకులు, టీబీజీకేఎస్ బ్రాంచి కార్యదర్శి కోటా శ్రీనివాసరావు, ఏరియా డీజీఎం(పర్సనల్) రేవు సీతారాం, సేవా అధ్యక్షురాలు జక్కం వాణి రమేష్, ఎఫ్‌ఆర్వోజి ప్రసాదరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైంటిఫిక్ ఆఫీసర్ బాలునాయక్, రవిశంకర్, ఎ స్వోటూ జీఎం బోగా వెంకటేశ్వర్లు, డీజీఎం(సివిల్) వెంకటేశ్వర్లు, ఫా రెస్ట్రీ ఆఫీసర్ హరినారాయణ, ప ర్యావరణ అధికారి నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, నటరా జ్, డీవైసీఎంవో డాక్టర్ మేరికుమా రి, ఎస్టేట్ ఆఫీసర్ ఉషశ్రీ, హెచ్‌ఎం స్వరూపరాణి, పీఎం అజయ్‌కుమార్, సం క్షేమ అధికారులు మదార్‌సాహెబ్, సింగు శ్రీనివాసరావు, రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles