నకిలీ రబ్బర్ స్టాంపుల తయారీదారుడిపై కేసు

Fri,August 23, 2019 04:26 AM

జూలూరుపాడు: మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ కార్యాలయం నకిలీ రౌండ్ సీల్, పంచాయతీ కార్యదర్శి ముద్రలను తయారు చేయించిన వ్యక్తిపై స్ధానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ పంచాయతీ కార్యాలయం రౌండ్ సీల్, కార్యదర్శి రబ్బర్ స్టాంప్‌లను తయారు చేయించేందుకు ఈ నెల 10న కొత్తగూడెంలోని ఆదిత్య ప్రింటింగ్ ప్రెస్‌కి వెళ్లాడు.అదే ప్రింటింగ్ ప్రెస్‌లో కాకర్ల గ్రామ పంచాయతీకి చెందిన రౌండ్ సీల్, పంచాయతీ కార్యదర్శి రబ్బర్ స్టాంప్‌ల కొరకు ఆర్డర్ ఇచ్చి ఉండటంతో ఎంపీటీసీ సతీష్‌కు అనుమానం వచ్చింది.పూర్తిస్ధాయిలో విచారణ చేయడంతో కాకర్ల గ్రామానికి చెందిన వేముల ఉపేందర్ వాటర్‌షెడ్ అభివృద్ధి నిధులు పక్కదారి పట్టించేందుకు నకిలీ స్టాంపులు చేయించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపేందర్‌పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరొకరిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్సై మహేష్ పేర్కొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles