కొత్తగూడెం క్లబ్‌లో జిల్లాస్థాయి క్విజ్ పోటీలు

Fri,August 23, 2019 04:26 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్: మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి అన్నారు. భారతీయ జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో గురువారం చరిత్ర వారసత్వ క్విజ్-2019 జిల్లాస్థాయిలో నిర్వహించారు. మొత్తం 60 మంది విద్యార్థులు హాజరుకాగా త్రివేణి పాఠశాల విద్యార్థినులు షబానా, వెన్నెల మొదటి బహుమతి, శారద విద్యాలయం విద్యార్థులు మోహన్ చరణ్‌తేజ్, యశ్వంత్‌లు ద్వితీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, ఇంటాక్ తెలంగాణ కో కన్వీనర్ అనురాధారెడ్డి, క్విజ్ మాస్టర్ సోమిరెడ్డిలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారతీయ చరిత్ర సంస్కృతి, వారసత్వం గురించి తెలియజెప్పేందుకు ఇంటాక్ సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందని, విద్యార్థులు, భారతచరిత్ర, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలను, కళలను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీనివాసరావు, నరేందర్ రెడ్డి, మల్సూర్ పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles