రామాలయంలో ప్రత్యేక పూజలు

Fri,August 23, 2019 04:25 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, అర్చన, సేవాకాలం, నివేదన, పుణ్యాహవచనం, నివేదన తదితర పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రామయ్యను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయంలోగల శ్రీలక్ష్మీతాయామ్మ వారిని, అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంలో ని సీతమ్మ వారి నగలను ఆసక్తిగా తిలకించారు. ఆలయంలోని బేడా మండపంలో శ్రీ సీతారాముల వారికి అర్చకులు ఘనంగా నిత్య కల్యాణం నిర్వహించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles