గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

Fri,August 23, 2019 04:25 AM

-అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వవద్దు: ఖమ్మం కలెక్టర్ కర్ణన్
ఖమ్మం నమస్తేతెలంగాణ: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు ప్లాస్టిక్ రహిత గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని , గణేష్ నవరాత్రులు, ఉత్సవాలు, నిమజ్జనం శాంతి యుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఉత్సవ కమిటీలు సహకరించాలని కలెక్టర్ కర్ణన్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో గణేష్ నవరాత్రుల ఉత్సవాలపై స్తంభాద్రి ఉత్సవ కమిటీ, అనుబంధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు గాను పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ , రెవెన్యూశాఖలచే ముందస్తు అనుమతి పొందాలని ,శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించాలని కమిటీ బాధ్యులకు కలెక్టర్ సూచించారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles