క్రీడల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Wed,August 21, 2019 11:51 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: గిరిజన ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థుల క్రీడల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పీఈటీలపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం సాయంత్రం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆశ్రమ, వసతి గృహాలలో పనిచేసే పీఈటీలతో పీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాఠశాలలో క్రీడా స్థలం బాగా ఏర్పాటు చేసుకునే బాధ్యత సంబంధిత పీఈటీలదేనన్నారు. ఉదయం పాఠశాల తెరవగానే ప్రార్థన సమయం నుంచి మార్చ్‌ఫాస్ట్ సమయములో విద్యార్థులు క్రమశిక్షణ పాటించేలా పీఈటీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులచే క్రికెట్, చెస్ తప్పకుండా ఆడించాలని, వచ్చే వారం కల్లా అన్ని పాఠశాలల గ్రౌండ్‌లలో క్రికెట్ తప్పనిసరిగా విద్యార్థులచే ఆడించాలని పేర్కొన్నారు. క్రీడా స్థలం లేని దగ్గర పాఠశాలకు దగ్గరలో ప్రభుత్వ భూమికాని, ప్రైవేట్ భూమి ఉంటే అద్దెకు తీసుకోవాలని సూచించారు.

చెస్ ఆటల విషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరచకూడదన్నారు. ఆగస్టు26 నుంచి 29వ తేదీ వరకు ప్రతీ పాఠశాలలో క్రీడలు నిర్వహించాలని వెల్లడించారు. అదేవిధంగా డివిజన్ స్థాయి పోటీలు సెప్టెంబర్18 నుంచి 20వ తేదీ వరకు, జోనల్ స్థాయి అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలలోని విద్యార్థులకు ఆర్చరీ, వాలీబాల్, కబడ్డీ, టెన్నీస్, ఖోఖో, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ ఆటలు విద్యార్థులకు భాగా ఆడిపించి అక్టోబర్ 29వ నుంచి 31వ తేదీ వరకు ఆదిలాబాద్‌లో జరిగే స్టేట్ లెవల్ క్రీడల్లో పాల్గొని గెలిచి పథకాలు తెచ్చేలా విద్యార్థులను సిద్దం చేయాలని పీవో గౌతమ్ పీఈటీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీడీ టీడబ్ల్యూ జహీరుద్దీన్, క్రీడల అధికారి పుట్టా శంకరయ్య, ఏటీడీఏలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles