భవిష్యతరాలకు మణిహారం హరితహారం

Wed,August 21, 2019 11:50 PM

రామవరం: సీఎం కేసీఆర్ మానసపుత్రిక తెలంగాణ హరితహారంలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్ ఓసీలో ఐదో విడత హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయనకు కొత్తగూడెం ఏరియా జనరల్ మెనేజర్ సీహెచ్ నర్సింగారావు పుష్పగుచ్ఛాన్నిచ్చి స్వాగతం పలికారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి గనులు విస్తరించడం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో ప్రజల అభివృద్ధి కోసం సీఎస్‌ఆర్ నిధులద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కోరారు. సింగరేణి అభివృద్ధితో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని నిర్వహిస్తున్న హరితహారం ద్వారా నాలుగు ఎకరాలలో రెండు వేల మొక్కలను నాటేందుకు చక్కటి ఏర్పాటు చేసినందుకు కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావును అభినందించారు.

సత్తుపల్లిప్రజలకు పదివేల మొక్కలను జేవీఆర్ ఓసీ పీవో ఆఫీసు నుంచి పంపిణీ చేస్తామని కొత్తగూడెం ఏరియా జీఎం సీహెచ్ నర్సింహారావు తెలిపారు. ఈ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒక్కరోజులో 2వేల మొక్కలను నాటారు. ఇందులో డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం ఒక్కరే 516 మొక్కలను నాటి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం, జీఎం ఐఈడీ రుషేంద్రుడు, ఎస్‌వోటూ డైరెక్టర్ ఆపరేషన్స్ దేవీ కుమార్, ఎంపీపీ హైమావతి, సర్పంచు జే.ప్రభాకర్‌రావు, విజయలక్ష్మీ, మున్సిపల్ కమీషనర్, వెంకన్న, బెటాలియన్ కమాండెంట్ రామ్‌ప్రకాష్, జడ్పీటీసీలు,ఎంపీటీసీలు, ఎస్‌వోటూజీఎం నారాయణరావు, ఏరియా ఇంజినీరు ఎన్.దామోదర్, ఏజీఎం పర్సనల్ శ్రీనివాస్, పీవోలు సంజీవరెడ్డి, వేణుగోపాల్, కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు రజాక్, కొత్తగూడెం సీఎంవోఏఐ ప్రెసిడెంట్ పాలడుగు శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ సామ్యోల్ సుధాకర్, డీజీఎం సివిల్ సూర్యనారాయణ, ఎన్విరాల్‌మెంట్ మేనేజర్ సత్యనారాయణ, ఎస్.ఎస్.వో శ్రీనివాస్ పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles