జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

Wed,August 21, 2019 11:50 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఓ మోస్తరు వర్షం సాయంత్రం వరకు జల్లులుగా కురుస్తూనే ఉంది. కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నిండాయి.

మరికొన్ని చెరువులు, కుంటల్లోకి ఈ వర్షానికి కొత్తనీరు వచ్చి చేరుతోంది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన వర్షంతో సేదదీరారు. వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. సాయంత్రం 5 గంటలకే జిల్లా కేంద్రంలో నల్లటిమబ్బులతో చీకటి కమ్ముకుపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా చర్ల మండలంలోని తాలిపేరుకు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో బుధవారం ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి 5042 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles